IPL Media Rights : Star VS Sony-Zee VS Jio, జియో ఛానల్ గట్టిపోటీ.. బంగారు బాతు || Oneindia Telugu

2021-11-22 1

IPL media rights tender likely to be delayed further says Reports. A Sony-Zee bid for the 2023-2027 media rights for one of the world’s most valuable sports competitions would set up a battle with existing holder, Indian media company Star India.
#IPLMediaRights
#IPL2023to2027
#IPL2022Megaauction
#JioTV
#StarIndia
#SonyZee

ఐపీఎల్ టోర్నమెంట్.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై కనక వర్షాన్ని కురిపిస్తోంది. వరల్డ్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్లల్లో ఒకటిగా ఇదివరకే గుర్తింపు తెచ్చుకున్న ఈ ధనాధన్ ఫార్మట్‌ బీసీసీఐకి బంగారుబాతులా మారింది. కొత్తగా మరో రెండు ఫ్రాంఛైజీలు వచ్చి చేరిన తరువాత మరింత డిమాండ్ పెరిగింది. దానికి అనుగుణంగా ప్రసార హక్కుల ద్వారా రాబట్టుకోవాల్సిన ఆదాయాన్ని మరింత పెంచుకోనుంది బీసీసీఐ. 2023-2027 మధ్య అయిదు సంవత్సరాల కాలానికి సంబంధించిన ప్రసార హక్కులను మంజూరు చేయడం ద్వారా కనీసం అయిదు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2018-2022 మధ్య కాలానికి సంబంధించిన ప్రసార హక్కుల కాల పరిమితి వచ్చే ఏడాది ముగిసిపోనుంది.